మొన్న ఆదివారం ఫోను చేస్తే అమ్మ ఒకటే చెప్పడం తాతయ్య అస్సలు కదలలేకున్నా, ఇంటిలో ఎవ్వరు లేరు అని కూడా ఆలోచించకుండా తనే ఒక్కొక్క స్టెప్పు చైర్ ముందుకు జరుపుకొంటూ, మా వాళ్ళ ఇల్లు అన్ని దాటుకుంటూ మా వీధి చివరిదాకా వెళ్లి అక్కడ రోడ్ కి ఎర్ర మట్టి తోలారు కదా అది చూసి వచ్చారంట. అంత బాగుంటుందా !!! నాకు మాత్రం ఏమి తెలుసు.
ఇంకా అప్పటి నుండి ఆయన కి ఆయుష్షు రోజుల నుండి గంటల లోకి మారింది (ఒక ౪౮ గంటలు) ....కాని అంత కష్టం గా ఉన్న కూడా చూడాలి అనిపించిన దృశ్యం చూసి ఆనందించారు ...అమ్మ బాగా కోప్పడింది అనుకోండి, సాయంత్ర ఆయనకు బి పి చివరికంటా తగ్గింది , అలిసి పోయారు కదా ..కానీ మంచి డాక్టరు గారు, పిలవగానే వచ్చి ఒక ఇంజిషన్ ఇచ్చి ఇంకా ౪౮ గంటలు పొడిగించారు అన్నమాట తాతయ్య ఆయిష్షు . లేక పోతే నేను అస్సలా మాట్లాడలేక పోయేదాన్ని చివరి సారిగా ...నేనేం అలా వెళ్ళితే మీ ఆరొగ్య౦ ఏమి అవుతుంది, లాంటివి కుంచెం కూడా అనలా ...ఎందుకు అనాలి?...కదల లేకున్నా కూడా ఎంచక్కా చూడాలి అనిపించినది వెళ్లి చూసి వచ్చేసారు ...నేను కూడా తాతయ్య ని స్ఫూర్తి గా తీసికొని ,ఇప్పటి నుండి అమ్మో నా వల్ల కాదు ఇంకా అలా ఏమి అనను గాక అనను.
అప్పుడే మొదలయ్యింది కదా ..బ్లాగ్ లో వ్రాయడం నాకు రాదు అనుకున్నా , కానీ వ్రాస్తున్నాను అని తెలియకుండానే మొదలుపెట్టేసా !!!!
ఎలా అంటే బ్లాగ్ కి పేరు పెట్టాలి, 'తాతయ్య కల' అని అనిపించింది ఇంక. మరి ఆయన కలలు అన్ని నాకే తెలుసు అన్న గర్వం వచ్చేసి ఉంటుంది కాబోలు..
నాకు తాతయ్య ఇంకా అక్కడ ఇంటిలోనే ఉన్నట్లు, అందరిని గదిమేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కరిని ఎన్ని సార్లు చూసినా మల్లీ చివరిసారి చూడాలి అని మారాం చేసేవారు...ఆయన పిల్లల్ని మాత్రమే కాదు తన అన్నయ్యల పిల్లలు కూడా వచ్చి చూసేలా చేసికొనే వారు . లవ్ యు తాతయ్యా ! ఇంక మనం ఫోన్ లో మాట్లాడు కోవడం కుదరదు కదా..అందుకే ఇక్కడ చెప్తున్నా :)
8 comments:
మీరు తాతయ్యని కోల్పోయినందుకు చింతిస్తున్నా. ఆయన ప్రతిరూపంగా ఈ బ్లాగ్ ని రూపొందించాలన్న ఆలోచన బాగుంది. మీ వచన రచన శైలి బాగుంది. రాస్తూ ఉండండి.
sorry to hear about your tata ...but idea of this concept is veyr nice keep i tup
hi,,,,
munduga naa blog chadivinanduku dhanyavaadamulu...
1.sabbula comedy ok....
2.udyogamu,bharya,bhartha lo meeru raasina comment naku artham kaaledu...konni letters type avvala.
meeku veelu aithe telugulono,,,leka english lo kaani malli comment cheyandi....
please..
and meedi kooda choosanu....good....kontha mandi manchi manushulu untarandi...like mee thathayya...but duradrustam yemitante chala yekkuvamandiki vallu poyaka kani valla viluva theliyadhu....ee vishayam naku chala badha kaligisthundhi..
recent ga choodandi...michel jakson.....ayana poyaka prathi tv channel ade vaartha .....nijamga naa matuku aithe media vallu ayana gurinchi antha chepthe kaani ayana gurinchi theliyala..
ade ayana bathiki unnappudu avi anni cheppi unte yentha baagundedi.....
anyway
all the best
bye
sobha
Sobha garu,
thanks andi ..mee comments lo oka letter miss type ayyindi andi ...so commented again ...
Meeru MJ gurinchi chepthunte chala amayakam ga adiginatlunnadi ....nizam andi ..nenu manchi chedu rendooo chadivaanu long back and when ever it was time to talk about him...so it is just you dint come across with his story before this for various reasons ...
we fallow the tradition to speak only good about the persons after their death ....it is just minumum courtesy unless they are Ravana or Bakasura types ...simply its their day ....even I felt lot good when I heard about Veerappan ...but you know what he also killed somany ...do not want to confuse you with quite opposite examples .....surely MJ is nice human being.hope you understand ...
Phanindra,
parvaledu andi ..tatayya poorthi kaalamu jeevincharu anavachunu ...
inka meeru malli malli encourage chestunte ento nizam gane vrayagalanu anipistundi andi
Mallika,
Parvaledu, sorry anhta kaadu le ..Soma Varam chanipoyaru ...yenni varhalu posinaaa alaa raadu anta ...last week eenadu kadhalo ilane undi mari ...Thanks dear...
http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html
కామెంట్లను కూడా తెలుగులో పై పోస్టులో చెప్పిన ఉపకరణంతో రాయవచ్చు.
మీ తాతయ్య స్పూర్తితో ముందుకు కదలండి ఇక. అభినందనలు
బ్లాగ్ పేరు బావుందండి.
మరి అయన కలలు ఎంతో రాయండి.తప్పకుండ మన తరానికి అవి inspiring గాఉంటాయి.
Post a Comment